: జగన్ నియంతృత్వ ధోరణి వల్లే పార్టీ ఓటమి పాలైంది: వైసీపీ నేత పైల నర్సింహయ్య
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకూ అసంతృప్త నేతల జాబితా పెరిగిపోతోంది. తాజాగా పార్టీ నేత పైల నర్సింహయ్య జగన్ పై మండిపడుతున్నారు. జగన్ నియంతృత్వ ధోరణి వల్లే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మల దగ్ధం కోసం చేపట్టిన 'నరకాసుర వధ'ను పార్టీ నేతలే వ్యతిరేకించారని, అయినా పార్టీ నేతల మాటలను జగన్ వినలేదని వెల్లడించారు. అసలు బీసీలు ఆయనను ఏ మాత్రం నమ్మడంలేదని చెప్పారు. కాబట్టి, తాను త్వరలో పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు.