: కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సరైందే: ప్రొఫెసర్ హరగోపాల్
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్ధి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై హైదరాబాదులో ఈరోజు (శుక్రవారం) సమావేశం జరిగింది. పలువురు విద్యావేత్తలు, విద్యార్ధి సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సరైందేనని, విద్యార్థుల ఆందోళన వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు.