: ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో చాన్సులున్నాయంటున్న తమిళ తంబి
ఇంగ్లండ్ తో నాలుగో టెస్టు తొలి రోజున దారుణంగా భంగపడిన భారత్ కు మ్యాచ్ లో ఇంకా అవకాశాలున్నాయంటున్నాడు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. రెండో రోజు ఆటలో తమ బౌలర్లలో ఎవరో ఒకరు ఇంగ్లండ్ పనిపడతారని భావిస్తున్నట్టు ఈ తమిళ తంబి పేర్కొన్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 152 పరుగులకే చేతులెత్తేయడం తెలిసిందే. అనంతరం తన తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన ఆతిథ్య జట్టు 3 వికెట్లకు 113 పరుగులు చేసింది. ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ, ఇలాంటి పిచ్ పై ఇన్ని పరుగులు చేస్తామని ముందే చెప్పలేమని అభిప్రాయపడ్డాడు. ఎన్ని పరుగులు చేసినా, ఇంకొన్ని చేస్తే బాగుండేదని అంటారని అశ్విన్ వివరించాడు. రంజీల్లోనూ... ఇలాంటి ఆరంభాలను ఎదుర్కొన్న జట్లు చివరికి గెలవడం చూశామని తెలిపాడు.