: ఫేస్ బుక్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారా..! అయితే, వైరస్ లో కాలేసినట్టే..!


ఫేస్ బుక్ ఎప్పుడూ నీలి రంగులోనే ఉండడమేంటి? మార్చితే పోలా..! అని భావించే ఔత్సాహిక నెటిజన్లు చాలామందే ఉంటారు. "మీ ఫేస్ బుక్ రంగు మేం మార్చుతాం" అంటూ చాలా అప్లికేషన్లు రంగంలో ఉన్నాయని... అయితే, వాటి జోలికి వెళ్లి ప్రయత్నిస్తే, కోరి వైరస్ తో తల గోక్కున్నట్టేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రంగు మార్చాలని ప్రయత్నిస్తే 'కలర్ చేంజ్' మాల్వేర్ బారినపడడం ఖాయమని వారు అంటున్నారు. ఇప్పటికే ఈ మాల్వేర్ ను ఫేస్ బుక్ ఎన్నోసార్లు తొలగించినా, మళ్ళీమళ్ళీ ప్రత్యక్షమవుతూనే ఉంది. కలర్ చేంజ్ ఎలా చేయాలో చెబుతామంటూ, యూజర్ల పాస్ వర్డ్స్ ను ఈ మాల్వేర్ తస్కరిస్తుంది. దీనికి సంబంధించిన యాప్ ను ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్నట్టయితే దానిని వెంటనే తొలగించాలని చైనాకు చెందిన చీటా మొబైల్ అనే ఇంటర్నెట్ సంస్థ చెబుతోంది.

  • Loading...

More Telugu News