: చంద్రబాబు పదేళ్ల పాటు హైదరాబాద్ లోనే మకాం ఉంటారట!


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాజధాని లేకపోవడం వల్ల ఏర్పడే పరిపాలనపరమైన ఇబ్బందులను... ఆలస్యాలను తగ్గించడానికి చంద్రబాబు ఆన్ లైన్ ను ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికారులకు ఇవ్వడానికి 5,000 ల్యాప్ టాప్ లు సిద్ధం చేయాల్సిందిగా తన పేషీని ఆదేశించారు. ఇలా ఇవ్వడం వల్ల 13 జిల్లాల్లో ఉన్న అధికారులకు... సీఎం పేషీని వెంటనే కాంటాక్ట్ చేయడం కుదురుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే ఎప్పుడు ఏ సమస్య వచ్చినా... ఏదైనా విషయం తెలియజేయాలన్నా జిల్లాల్లో ఉన్న అధికారులు వెంటనే ఏపీ సెక్రటేరియట్ తో, సీఎం పేషీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టచ్ లోకి రావాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2017 కల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలను పూర్తిగా... ఆన్ లైన్ లోనే జరపాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి ఈ-క్యాపిటల్ అడ్మినిస్ట్రేషన్ అని ఏపీ ప్రభుత్వ వర్గాలు నామకరణం చేశాయి. ఇలా ఆన్ లైన్ పరిపాలన మీద చంద్రబాబు ఇంతగా దృష్టి పెట్టడానికి మరో కారణం... చంద్రబాబు ఈ పదేళ్లు హైదరాబాద్ లోనే ఉండాలనుకుంటున్నారు. ఒకవేళ ఐదేళ్లలో ఏపీకి రాజధాని నిర్మాణం పూర్తయినా సరే... పదేళ్ల పాటు హైదరాబాదులోనే మకాం ఉండాలని నిశ్చయించుకున్నారు. తాను హైదరాబాద్ లో ఉండడం వల్ల... తెలంగాణలో టీడీపీ బలపడేందుకు ఆస్కారముంటుందని చంద్రబాబు అనుకుంటున్నారు. టీడీపీని తెలంగాణలో ఓ దారికి తెచ్చేవరకు చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటారని టీడీపీ వర్గాలు కూడా అంటున్నాయి. ఈ కారణంగా... ఏపీలోని మిగతా శాఖల కార్యాలయాలు విజయవాడకు తరలిపోతున్నా, సిఎం పేషీ మాత్రం హైదరాబాద్ లోనే ఉండనుంది.

  • Loading...

More Telugu News