: దక్షిణమధ్య రైల్వేపై విరుచుకుపడ్డ నాయిని నర్సింహారెడ్డి
మాసాయిపేట రైలు ప్రమాద సంఘటన స్థలం దగ్గర తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవేశంతో ఊగిపోయారు. దక్షిణమధ్య రైల్వేపై ఆయన విరుచుకుపడ్డారు. దక్షిణమధ్యరైల్వే జీఎంపై రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం రైల్వే క్రాసింగ్ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇంత ఘోరమైన సంఘటన జరిగిందని నాయిని నర్సింహారెడ్డి అన్నారు.