: మురళీమోహన్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం
మహిళలపై టీడీపీ ఎంపీ మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. అంబికాసోనీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను ఆర్డర్ లో ఉంచడానికి ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు సహకరించలేదు. దీంతో సభను 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. నిన్న లోక్ సభలో మురళీమోహన్ మాట్లాడుతూ, అత్యాచారాలు తగ్గాలంటే మహిళలు డీసెంట్ గా ఉండే దుస్తులు ధరించాలని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.