: ఫెన్సింగ్ లో చిన్నారి చిక్కుకుపోవడంతో వైట్ హౌస్ వద్ద కలకలం


అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యాలయం వైట్ హౌస్ వద్ద భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో తెలిసిందే. అయితే, ఎలా వచ్చాడో గానీ, ఓ చిన్నారి ఆ భవన సముదాయం ఫెన్సింగ్ లో చిక్కుకుపోయాడు. వెంటనే అలారం మోగడంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. అసలే టెర్రరిస్టు దాడులంటేనే ఉలిక్కిపడుతున్న అమెరికా భద్రతాధికారులు ఈ ఘటనతో అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ మొత్తాన్ని దిగ్బంధించి అణువణువూ క్షుణ్ణంగా గాలించారు. చివరికి ఆ చిన్నారిని గుర్తించి క్షేమంగా బయటికి తీశారు. అయితే, ఆ బాలుడు మాట్లాడేంతవరకు వేచి ఉండాలని భావించినా, అతను మాట్లాడలేకపోతుండడంతో... తామే అతని తల్లిదండ్రుల సమాచారం సేకరించి, వారికి అప్పగించామని అమెరికా సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఎడ్విన్ డోనోవాన్ వివరించారు.

  • Loading...

More Telugu News