: తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అస్తవ్యస్తంగా తయారైంది: చంద్రబాబు


విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీఆర్ఎస్ పై సెటైర్లు విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పాలన అస్తవ్యస్తంగా తయారయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఆ పార్టీ ప్రజావిశ్వాసాన్ని కోల్పోతుందని జోస్యం చెప్పారు. కాసేపటి క్రితం ఆయన విశాఖ జిల్లా పర్యటన ప్రారంభమైంది. అనకాపల్లిలోని నూకాల అమ్మవారి పూజతో పర్యటనను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, విశాఖ నగరాన్ని కాలుష్యపు కోరల నుంచి కాపాడతామని అన్నారు. హైదరాబాదుకు దీటుగా విశాఖలో ఐటీ, పర్యాటక, చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని ఉన్నత పరిశ్రమలను తీసుకొస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగార సామర్థ్యాన్ని 10 మిలియన్ టన్నులకు తీసుకొస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News