: భారం బౌలర్లపైనే! ముంచుతారో, తేల్చుతారో..!
మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో మరో ఓటమి ముప్పు ఇప్పుడు టీమిండియాను భయపెడుతోంది! టాస్ గెలిచిన కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకుని ఘోర తప్పిదం చేయగా, బ్యాట్స్ మెన్ అందుకు తగ్గట్టుగానే వ్యవహరించారు. మొత్తమ్మీద దారుణ ప్రదర్శన కనబరిచి తొలి రోజు ఇంగ్లండ్ కు దాసోహమయ్యారు. అయితే, భారత్ కు ఇంకా అవకాశాలున్నాయి. రెండో రోజు గనుక ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలిగితే, మ్యాచ్ విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు భారమంతా బౌలర్లపైనే ఉంది. పిచ్ కూడా విశేషంగా సహకరిస్తోందన్న విషయం ఆండర్సన్, బ్రాడ్ సోదాహరణంగా నిరూపించారు. ఈ క్రమంలో షమి, భువీపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది. మరి ఈ జోడీ ముంచుతుందో, తేల్చుతుందో చూడాలి!