: ఇంట్లో జారిపడ్డ జశ్వంత్ సింగ్... తలకు తీవ్రగాయాలు... ఐసీయూలో అత్యవసర చికిత్స
బీజేపీ మాజీ సీనియర్ నేత జశ్వంత్ సింగ్ ఢిల్లీలోని తన ఇంట్లో జారిపడ్డారు. ఈ కారణంగా జశ్వంత్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఢిల్లోని ఆర్మీ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆసుప్రతిలోని ఐసీయూలో వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు బీజేపీకి రాజీనామా చేసి... ఇండిపెండెంట్ గా ఆయన లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగారు.