: నాలుగో టెస్ట్ లో భారత్ అరుదైన రికార్డ్
నాలుగో టెస్ట్ లో భారత బ్యాట్స్ మెన్ తమ పేలవ బ్యాటింగ్ తో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్ విజయ్, పుజారా, కోహ్లీ, జడేజా, భువనేశ్వర్ కుమార్, పంకజ్ సింగ్ డకౌట్ అయ్యారు. భారత్ క్రికెట్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అవడం ఇదే తొలిసారి. దీంతో ఒక టెస్టు ఇన్నింగ్స్ లో ఎక్కవ మంది డకౌట్ అయిన జట్టుగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాల రికార్డును భారత్ సమం చేసింది. ఈ రికార్డుకు కొసమెరుపుగా భారత్ మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. ఒకే ఇన్నింగ్స్ లో ఆరుగురు డకౌట్ అయిన సందర్భంలో... భారత్ నిన్న చేసిన స్కోరు(152) అత్యధికం కావడం విశేషం.