: తెలంగాణలో 960 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు... రోడ్డున పడనున్న కుటుంబాలు


కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తామని ఓ వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజూ చెబుతూనే ఉన్నారు. కానీ, వాస్తవం మరోలా ఉంది. విద్యుత్ సబ్ స్టేషన్లలో వాచ్ మెన్లుగా పనిచేస్తున్న 960 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. సబ్ స్టేషన్లలో వాచ్ మెన్ల వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ఎన్ పీడీసీఎల్ ఉత్తర్వులు (జులై 31వ తేదీన) జారీ చేసింది. దీంతో ఎన్ పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాలైన వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ లలోని 960 మంది కాంట్రాక్ట్ వాచ్ మెన్లు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీతో సంతోషంగా ఉన్న వీరు... ఇప్పుడు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలోకి జారుకున్నారు.

  • Loading...

More Telugu News