: తెలంగాణ కరెంట్ కష్టాలకు మోడీ, చంద్రబాబులే బాధ్యులు: హరీష్ రావు


తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన విద్యుత్ సమస్య పట్టి పీడిస్తోంది. కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులైతే ఏకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి... రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ క్రమంలో, తమను అడ్డుకుంటున్న పోలీసులపై దాడులకు కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో, కరెంట్ కోతల వ్యవహారం కేసీఆర్ సర్కారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఈ వ్యవహారంపై టీఎస్ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణలో కరెంటు కష్టాలకు ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులే కారణమని దుయ్యబట్టారు. 450 మెగావాట్ల సామర్థ్యం ఉన్న లోయర్ సీలేరును ఆంధ్రకు మోడీ కేటాయించారని మండిపడ్డారు. కరెంట్ కోతలపై బీజేపీ నేత కిషన్ రెడ్డి విమర్శలు చేయడాన్ని హరీష్ తప్పుబట్టారు. దమ్ముంటే, ఆంధ్రకు ఇచ్చిన వాటాను తెలంగాణకు ఇప్పించాలని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News