: ప్రమాదస్థలి వద్ద ఉద్రిక్తత... పోలీసుల లాఠీచార్జి
రైల్వే శాఖ నిర్లక్ష్యం కారణంగానే స్కూలు బస్సును రైలు ఢీకొన్నదని ఆరోపిస్తూ స్థానికులు ఘటనాస్థలి వద్ద ఆందోళనకు దిగారు. మృతదేహాల తరలింపును అడ్డుకున్నారు. ఆగ్రహంతో రైల్వే పోలీసులపై రాళ్ళు రువ్వారు. దీంతో మాసాయిపేట రైల్వే గేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.