: ‘గోవిందుడు అందరి వాడేలే’ టీజర్ విడుదల
హైదరాబాదు శివారు నానక్ రాంగూడలో రామ్ చరణ్ తేజ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కు తాతగా ప్రకాశ్ రాజ్ నటించగా, శ్రీకాంత్ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ ఇవాళ (గురువారం) విడుదల చేసింది.