: దేశ భవిష్యత్ ఏంటి?... మీ లక్ష్యం ఏంటి?: మోడీపై మమతా బెనర్జీ ఫైర్


ఎన్డీయే ప్రభుత్వం రక్షణ, రైల్వే రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. కోల్ కతాలో ఆమె మాట్లాడుతూ, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయం కారణంగా దేశ భవిష్యత్ ప్రశ్నార్థకంగా తయారయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంచడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ లక్ష్యమేమిటో తనకు అర్థం కావడం లేదని ఆమె మండిపడ్డారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింపచేస్తున్న రైల్వే రంగంలో నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎందుకు ఆహ్వానిస్తున్నారో తనకు ఏ మాత్రం అంతుచిక్కడం లేదని ఆమె తెలిపారు. భారత రైల్వేలకు ప్రపంచంలోనే మంచి పేరు ఉందని అన్నారు. ఎన్డీయే తాజా నిర్ణయాల కారణంగా భారతదేశ భవిష్యత్ ఎలా ఉండబోతుందో తనకు అర్థం కావడం లేదన్నారు.

  • Loading...

More Telugu News