: శ్రీశైలం డ్యాంలోకి ప్రవహిస్తున్న వరద నీరు
శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు ప్రవహిస్తోంది. డ్యాంలోకి ఇన్ ఫ్లో 1 లక్షా 96 వేల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 66 వేల క్యూసెక్కులు ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 874.3 అడుగులు. జలాశయ పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 160.5 టీఎంసీలు.