: శ్రీశైలం డ్యామ్ ను ముట్టడించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు


కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీశైలం డ్యామ్ ను ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లాకు తాగునీరు అందించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు ప్రకటించారు. కృష్ణా వాటర్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. శ్రీశైలం డ్యామ్ లో నీటి మట్టం 854 అడుగులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

  • Loading...

More Telugu News