: మాసాయిపేట ప్రమాదస్థలం దగ్గర వేలాదిమంది ప్రజలు
మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాద స్థలం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఘటనాస్థలికి వచ్చిన రైల్వే అధికారులను అడ్డుకుని తీవ్ర నిరసన తెలిపారు. ప్రమాదం స్థలం పక్కనే ఉన్న నేషనల్ హైవేపై వందలాది మంది ప్రజలు ధర్నాకు దిగడంతో అటూ, ఇటూ ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరిసర గ్రామాల నుంచి వేలాది మంది ప్రమాదస్థలానికి చేరుకుంటున్నారు.