: బేణివాల్ తొలగింపు ముమ్మాటికీ కక్షసాధింపు చర్యే: సచిన్ పైలట్


మిజోరం గవర్నర్ కమలా బేణివాల్ తొలగింపు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ విమర్శించారు. జైపూర్లో ఆయన మాట్లాడుతూ, మాజీ కేబినెట్ మంత్రి అయిన బేణివాల్ భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు. పదవీకాలం ముగుస్తున్న ఆమెను తొలగించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఆమెను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని సచిన్ పైలట్ తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ కూడా ఆమెను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తొలగించారని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, రాజ్యాంగ బద్ధంగానే బేణివాల్ ను తొలగించామని, ఇందులో రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News