: భార్యను దారుణంగా నరికి చంపిన భర్త
కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా నరికి చంపాడో భర్త. భార్యను హతమార్చిన తర్వాత... శరీరాన్ని ముక్కలుగా నరికి, రెండు మూటలుగా కట్టి, వాటిని వేర్వేరు ప్రదేశాల్లో పడేశాడు భర్త రామకృష్ణ. భయోత్పాతాన్ని కలిగించే ఈ సంఘటన కాకినాడ పట్టణంలో జరిగింది. కాకినాడలోని జనరల్ ఆసుపత్రి, సుందరయ్య భవనం వద్ద మూటలను భర్త పడేశాడు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.