: హైదరాబాదులో మెట్రోరైలు ట్రయల్ రన్
హైదరాబాదు నగరంలో మెట్రో రైలు ట్రయల్ రన్ ను అధికారులు ఇవాళ (గురువారం) నిర్వహించారు. నాగోలు జంక్షన్ నుంచి సర్వే ఆఫ్ ఇండియా జంక్షన్ (ఉప్పల్) వరకు ఈ ట్రయల్ రన్ సాగింది. నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు... ట్రయల్ రన్ నిర్వహించడంపై హైదరాబాదీలు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఉగాది నాటికి పట్టాలపై మెట్రో రైలు పరుగులు తీస్తుందని అధికారులు చెప్పారు.