: సచిన్ క్రికెట్ లో బెస్ట్... రాజకీయాల్లో లీస్ట్!


సచిన్ టెండూల్కర్ అంటే తెలియని క్రికెట్ అభిమాని ఉండడేమో. సచిన్ ఖాతాలో టన్నుల కొద్దీ పరుగులు... క్రికెట్ లో రికార్డుల మోత. 200 టెస్ట్ లు ఆడి, 15,921 పరుగుల చేసిన ఘనత సచిన్ ది. ఒక్క మాటలో చెప్పాలంటే... సచిన్ క్రికెట్ దేవుడు. యూపీఏ ప్రభుత్వం సచిన్ టెండూల్కర్ ను గౌరవిస్తూ రాజ్యసభకు నామినేట్ చేసింది. 2012 జూన్ లో రాజ్యసభ సభ్యునిగా సచిన్ ప్రమాణ స్వీకారం చేశాడు. క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన సచిన్... రాజకీయాల్లో మాత్రం నేతల విమర్శలను ఎదుర్కొన్నాడు. సచిన్ పార్లమెంటుకు హాజరయ్యింది చాలా తక్కువ. కాంగ్రెస్ ఎంపీల్లో తక్కువ రోజులు హాజరైన వారిలో సచిన్ ముందున్నాడు. ఎంపీగా సచిన్ పార్లమెంటులో హాజరు 3 శాతం మాత్రమే. దీంతో, సచిన్ పై పలువురు నేతలు విమర్శలు కురిపించారు. ఈ రకంగా క్రికెటర్ గా బెస్ట్ అయిన సచిన్... రాజకీయాల్లో మాత్రం లీస్ట్.

  • Loading...

More Telugu News