: అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలి: కేసీఆర్
రాజకీయ అవినీతిని నిర్మూలిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభివృద్ధిలో వినూత్నంగా ఆలోచించాలని ఆయన అన్నారు. నిజామాబాద్ పర్యటనలో కేసీఆర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు డైనమిక్ గా పనిచేయాలన్న కేసీఆర్... దేశంలోనే సింగరేణికి ఎంతో అనుభవముందని అన్నారు. అవసరమైతే సింగరేణి బోర్డు సమావేశానికి తాను వస్తానని చెప్పారు. విదేశాల్లో ఉన్న బొగ్గుగనుల్ని కొనాలని అన్నారు. మంత్రులు, అధికారులు ఫ్రెండ్లీగా ఉండాలని ఆయన చెప్పారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజా ప్రతినిధులను అధికారులు గౌరవించాలని ఆయన అన్నారు.