: వాళ్ళు స్వాతంత్ర్య సమరయోధులా..? ఉగ్రవాదులా..?
ఇటీవల పాఠ్యపుస్తకాల్లో ఘోరమైన తప్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల్లోనూ ఇలాంటి వక్రీకరణలే కనిపించాయి. ఎనిమిదో తరగతి చరిత్ర పుస్తకంలో పలువురు స్వాతంత్ర్య సమరయోధులను టెర్రరిస్టులుగా పేర్కొన్నారు. ఖుదీరాం బోస్, జతీంద్రనాథ్ ముఖర్జీ, ప్రఫుల్ల చాకీ వంటి నేతల చర్యలు అతివాదం, ఉగ్రవాదం కిందకి వస్తాయని ఆ పాఠ్యాంశాల్లో వివరించారు. బ్రిటీష్ కాలం నాటి అభిప్రాయాలనే ఇంకా నమ్ముతున్నట్టున్నారని ఈ విషయమై ఇర్ఫాన్ హబీబ్ అనే చరిత్రాకారుడు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై శివసేన తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ, అసలు ఈ పుస్తకాలను ఎవరు ముద్రించారో తెలుసుకోవాలని, ప్రభుత్వమే ముద్రించి ఉంటే మాత్రం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాళ్ళు బోస్ ను ఓ టెర్రరిస్టు అనగలిగితే, భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు లాంటి త్యాగధనులను సైతం టెర్రరిస్టులని పిలవగలుగుతారని ఆయన విమర్శించారు.