: చిటికెలో చపాతీ చేసే రోటీమేటిక్... భారత జంటకు ఆర్డర్ల వెల్లువ


సింగపూర్ లో నివాసముండే భారత దంపతులు రిషి ఇస్రాని, ప్రణోతి ఓ అద్భుత ఆవిష్కరణతో వార్తల్లోకెక్కారు. వారు తయారుచేసిన రోబో నిమిషానికో చపాతీ తయారు చేయగలదు. ఆ రోబో పేరు రోటీమేటిక్. అయితే, ఈ మరమనిషిని అభివృద్ధి చేసేందుకు వీరికి ఆరేళ్ళు పట్టింది. కాగా, ఈ రోబోకు అమెరికా నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు రిషి దంపతులు రూ.24 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకున్నారు. ఈ రోటీమేటిక్ ద్వారా మనక్కావాల్సిన విధంగా చపాతీ తయారు చేయించుకోవచ్చు. అంటే, రొట్టె మందంగా ఉండాలో, పల్చగా ఉండాలో మనమే సెట్ చేయవచ్చు. ఇక, ఎంత నూనె వేయాలి, రొట్టెకు ఏ పిండి వాడాలో కూడా పలు సెట్టింగ్స్ ద్వారా నిర్ణయించవచ్చు. అమెరికా మార్కెట్లో దీని విలువను రూ.36,700గా నిర్ణయించారు. రోటీమేటిక్ వచ్చే ఏడాది అక్కడి విపణిలో లభ్యమయ్యే అవకాశముంది. ఇస్రాని ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త కాగా, ప్రణోతి మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డిజైనింగ్ లో నిపుణురాలు.

  • Loading...

More Telugu News