: రష్యాలో మరో మూడేళ్లు ఉండేందుకు స్నోడెన్ కు అనుమతి
అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) మాజీ విశ్లేషకుడు ఎడ్వర్డ్ స్నోడెన్ మరో మూడేళ్ల పాటు రష్యాలో ఉండేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు అతని న్యాయవాది అనటోలీ కుచెర్నా మాస్కోలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపాడు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మూడు సంవత్సరాలపాటు స్నోడెన్ రష్యాలో ఉండేందుకు అంగీకారం లభించినట్లు చెప్పాడు. రష్యాలో తాత్కాలిక ఆశ్రయం గడువు జులై 30వ తేదీతో ముగియడంతో... స్నోడెన్ ఐదు వారాల ముందుగానే రష్యా ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన ప్రభుత్వం తాజాగా అందుకు అంగీకరించింది. ప్రస్తుతం స్నోడెన్ రష్యాలోని ఓ వెబ్ సైట్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా రహస్యాలను ప్రపంచానికి చేరవేస్తున్న కారణంగా అతనిపై ఇప్పటికే దేశద్రోహం కేసు నమోదు చేసింది.