: గంగానది ప్రక్షాళనకు ప్రపంచబ్యాంకు అధ్యక్షుడి హామీ
గంగానదిని శుద్ధి చేయాలన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశయానికి ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జిమ్ యోంగ్ కిమ్ బాసటగా నిలుస్తున్నారు. గంగానది ప్రక్షాళనకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం భారత్ కు ఓ అత్యున్నత స్థాయి బృందాన్ని పంపిస్తామని తెలిపారు. బుధవారం ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాన్పూర్ వద్ద గంగా నదిని పరిశీలించానని, పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయిందని జిమ్ చెప్పారు. అయితే, ఈ మహానది పవిత్రత దృష్ట్యా శుద్ధి చేయాల్సిన ప్రాధాన్యతను గుర్తించామని తెలిపారు.