: లోక్ సభలో మాట్లాడిన కొత్తపల్లి గీత


అరకు ఎంపీ కొత్తపల్లి గీత లోక్ సభలో మాట్లాడుతూ... సోషల్ మీడియాలో మహిళలపై అసభ్య రాతలు రాస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. హోదాలతో సంబంధం లేకుండా మహిళలను నీచంగా చూస్తున్నారని గీత అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె అన్నారు. సోషల్ మీడియా అత్యంత పవర్ ఫుల్ మీడియా అని, చట్టాల కంటే కూడా వ్యక్తుల్లో మార్పు వచ్చినప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News