: విమానం ఇంజిన్ లో దాక్కుని 3 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు


వరుస విమాన ప్రమాదాలతో, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతుంటే ఏకంగా విమానం ఇంజిన్ లో దాక్కుని 3 వేల కిలోమీటర్లు ప్రయాణించి పట్టుబడ్డాడో వ్యక్తి. రష్యాకు చెందిన జెట్ లైనర్ విమానం కెమిరోవా నగరం నుంచి బయల్దేరి హుర్ ఘడా లో ల్యాండైంది. విమానాన్ని మరో ప్రయాణానికి సిద్ధం చేసేందుకు అధికారులు రొటీన్ చెకప్ చేశారు. ఈ సందర్భంగా, ఇంజిన్ లో ఎవరో వ్యక్తి ఉండటాన్ని వారు గమనించారు. వెంటనే అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అధికారులకు ఎటువంటి సమాచారం అందలేదని, ఆయన ఇంజిన్ లోకి ఎలా వెళ్లాడనే దానిపై వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నాడని తెలిపిన అధికారులు, అతడిని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. అతను 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News