: గాజా సమస్యకు చర్చలే పరిష్కారం: భారత్
ఇజ్రాయెల్, హమాస్ దాడుల మధ్య సాధారణ పౌరులు నలిగిపోతుండడం పట్ల భారత్ స్పందించింది. గాజా సమస్యకు చర్చలే ఏకైక పరిష్కార మార్గమని సూచించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ మాట్లాడుతూ, గాజా సంక్షోభంపై రాజకీయపరమైన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ తో తాము ఏకీభవిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 72 గంటల కాల్పుల విరమణను భారత్ గౌరవిస్తుందని ముఖర్జీ అన్నారు. భారత్ ఎప్పుడూ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యమిస్తుందని ఆయన తెలిపారు.