: అంకాపూర్ రైతులపై వరాల జల్లు కురిపించిన కేసీఆర్


నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మండలంలోని ఆదర్శగ్రామం అంకాపూర్ కు ఆయన చేరుకున్నారు. అక్కడున్న రైతులతో కొద్దిసేపు ముఖాముఖి నిర్వహించారు. అంకాపూర్ రైతులపై కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. పంటల రక్షణ కోసం రూ. 1.50 కోట్లతో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు. పసుపు యంత్రాల కోసం రూ. 1.25 కోట్ల రూపాయలు సమకూర్చుతామని ఆయన అన్నారు. విత్తన ఉత్పత్తి క్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు. అలాగే రైతులు నీటిని నిల్వ చేసుకునే తొట్టెలకు ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తుందని కేసీఆర్ చెప్పారు.

  • Loading...

More Telugu News