: 'నిర్భయ' కేసులో బాలనేరస్థుడిపై పునర్విచారణ కోరుతున్న తల్లిదండ్రులు


ఢిల్లీ 'నిర్భయ' కేసులో దోషిగా రుజువైన బాల నేరస్థుడిని జువనైల్ జస్టిస్ బోర్డు బాలనేరస్థుల సంస్కరణ గృహానికి పంపాలంటూ గత నెలలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జువనైల్ చట్టం కింద మూడేళ్ల పాటు అతడు అక్కడే ఉంటాడు. ఇదిలావుంటే, తమ కుమారుడి విషయంలో పునర్విచారణ జరపాలని అతడి తల్లిదండ్రులు తాజాగా కోరుతున్నారు. కాగా, అతిక్రూరమైన కేసుల్లో బాలనేరస్థులు (16/18)గా ఉన్న వారిని వయోజనులుగా గుర్తించి కఠిన శిక్ష విధించాలన్న కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ సూచనలకు ఇటీవలే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు దానికి సంబంధించిన చట్టాన్ని కూడా సవరించనుంది. దీనివల్ల పద్దెనిమిదేళ్ల లోపు వారు కూడా వయోజనులుగా శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తమ కుమారుడికి శిక్ష పడవచ్చనే భయంతో బాలుడి తల్లిదండ్రులు పునర్విచారణ కోరుతున్నారు.

  • Loading...

More Telugu News