: మాంఛెస్టర్ టెస్ట్: టాస్ గెలిచిన భారత్
మాంఛెస్టర్ లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మరికాసేపట్లో ప్రారంభమవుతోంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. వర్షం కారణంగా స్టేడియం తేమగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతోంది. భారత్ - ఇంగ్లండ్ మధ్య 5 టెస్ట్ ల సిరీస్ లో భాగంగా మొదటిది డ్రా కాగా... రెండు, మూడు టెస్టుల్లో భారత్, ఇంగ్లండ్ చెరో విజయం సాధించి సిరీస్ లో 1-1తో సమంగా నిలిచాయి.