: జనగామలో ప్రైవేటు వైద్యుల నిర్వాకం... ఖమ్మంలో ప్రభుత్వ వైద్యుల పరిష్కారం


కమలహాసన్, సిమ్రన్ జంటగా నటించిన 'బ్రహ్మచారి' సినిమాని స్పూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ జనగామలోని పావని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఓ రోగి కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేశారు. దీంతో బాధితురాలు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. గత కొన్ని నెలలుగా కడుపు నొప్పి తీవ్రం కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు ఆమె కుటుంబ సభ్యులు. ఆమెను పరీక్షించిన వైద్యులకు జబ్బు తాలూకు ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో వైద్యులు ఆమెకు ఎక్స్ రే సిఫారసు చేశారు. ఎక్స్ రేలో కుట్లు వేసే కత్తెర కనబడడంతో ల్యాబ్ టెక్నీషియన్ మరోసారి చెక్ చేసుకున్నాడు. తరువాత ఆమె బంధువులకు అసలు విషయం చెప్పాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ జరిగిన విషయం వైద్యులకు తెలిపారు. దీంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న కత్తెరను బయటకు తీశారు. కాగా సిజేరియన్ సందర్భంగా ఆమెకు ఆపరేషన్ చేసిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు కత్తెర మర్చిపోయారని చెప్పారు. దీనిపై పావని ఆసుపత్రి వద్ద బాధితురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, పావని ఆసుపత్రి వైద్యులు దీనిపై నోరువిప్పడం లేదు.

  • Loading...

More Telugu News