: కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం వద్ద విద్యార్థుల ఆందోళన
జిల్లా కలెక్టర్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలోని గేట్ వే హోటల్ లో ఈ సమావేశం జరుగుతోంది. అయితే, హోటల్ ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్ యూ) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ తరలింపు కార్యక్రమంలో కొంతమందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి.