: తెలంగాణకు మొదటి శత్రువు ముమ్మాటికీ చంద్రబాబే!: మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ న్యాయమైనదేనని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అయితే, ఈ అంశంపై కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని విమర్శించారు. తెలంగాణకు మొదటి శత్రువు ముమ్మాటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అన్న ఆయన, టీ-టీడీపీ నేతలు సన్నాసుల్లా ఆంధ్రా పార్టీలకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. కాగా, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొన్ని రోజుల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.