: అత్యంత ఎత్తైన యుద్ధరంగాన్ని సందర్శించనున్న మోడీ!


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంగా పేరుగాంచిన సియాచిన్ ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 12న సందర్శించనున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న భారత సైనికుల్లో ఆయన పర్యటన ఉత్సాహం నింపుతుందని భావిస్తున్నారు. 2005 తర్వాత ఓ భారత ప్రధాని సియాచిన్ ప్రాంతంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రధాని హోదాలో పర్యటించారు. హిమాలయ పర్వత శ్రేణిలోని కారకోరం సానువుల్లో సియాచిన్ గ్లేసియర్ ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయిలో నమోదవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విధులు నిర్వర్తించడం కత్తిమీద సామేనన్నది సైనిక వర్గాల అభిప్రాయం. ఇప్పటివరకు ఇక్కడ వాతావరణ మార్పుల కారణంగా ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సియాచిన్ లో శత్రు సైనికుల కంటే వాతావరణమే ప్రధాన శత్రువు.

  • Loading...

More Telugu News