: ఆర్మీ అధికారి పతన్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న సీసీఎస్
పాకిస్థాన్ కు చెందిన అనుష్క అగర్వాల్ అనే యువతికి దేశ ఆర్మీకి చెందిన రహస్య విషయాలను తన ఈ-మెయిల్ ద్వారా చేరవేసిన ఆర్మీ అధికారి పతన్ కుమార్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ యువతి ఫేస్ బుక్, ఫోన్ కాల్ డేటాను తెప్పించుకున్నారట. సదరు యువతి పతన్ అకౌంటులో రూ.10 లక్షలు డిపాజిట్ చేసిందని... దాంతో, పూంచ్, రాజస్థాన్ సెక్టార్లలో ఆర్మీ కదలికలు తెలుసుకుందనీ అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పతన్ ను అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేయనున్నారని తెలుస్తోంది. అటు పతన్ ను తమకు అప్పగించాలని ఎన్ఐఏ కూడా కోరుతోందట.