: కోహ్లీ... సచిన్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా..!
వరుస వైఫల్యాలతో విమర్శకులకు టార్గెట్ గా నిలిచిన టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ సారథి సునీల్ గవాస్కర్ అమూల్యమైన సలహా అందజేశారు. సచిన్ టెండూల్కర్ ప్రస్థానాన్ని పరిశీలించి ఆట పట్ల స్ఫూర్తి పొందాలని సూచించారు. 2004లో సచిన్ సిడ్నీలో ఆడిన ఇన్నింగ్స్ ను కోహ్లీ ఓసారి చూడాలన్నారు. ఆ ఇన్నింగ్స్ కు ముందు సచిన్ 0, 1, 37,0 పరుగులు నమోదు చేశాడని... అయినా, అవేవీ మనసులో పెట్టుకోకుండా సిడ్నీ బరిలో దిగి 241 పరుగులు చేశాడని సన్నీ వివరించారు. కోహ్లీ మంచి ఆటగాడేనని, ప్రతి క్రికెటర్ కెరీర్లో గడ్డుకాలముంటుందని, ప్రస్తుతం అతనికి కష్టకాలం నడుస్తోందని అభిప్రాయపడ్డారు. కొంచెం క్రమశిక్షణ ప్రదర్శిస్తే కోహ్లీ పూర్వపు ఫాం అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని గవాస్కర్ పేర్కొన్నారు.