: ఇజ్రాయెల్ పై స్నేహభావాన్ని ఘనంగా చాటుకున్న ఒబామా


ఇజ్రాయెల్ పై స్నేహభావాన్ని మరోసారి ఘనంగా చాటుకుంది అమెరికా అధినాయకత్వం. రాకెట్ దాడులను, టెర్రరిస్టు దుశ్చర్యలను ఏ దేశం కూడా ఉపేక్షించరాదని పరోక్షంగా హమాస్ ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ కు ఈ విషయంలో తమ మద్దతు ఉంటుందని తెలిపారు. తమ భూభాగంపై జరిగే రాకెట్ దాడులను ఎదుర్కొనే హక్కు ఇజ్రాయెల్ కు ఉందని స్పష్టం చేశారు. వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ, "హమాస్ పై సానుభూతి ప్రదర్శించను కానీ, గాజాలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజలకు మాత్రం సానుభూతి తెలుపుతున్నాను" అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 72 గంటల కాల్పుల విరమణను పొడిగించాలని ఒబామా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News