: మితిమీరిన క్రికెట్టే భారత్ దుస్థితికి కారణమంటున్న లెజెండ్
భారత క్రికెట్లో కపిల్ దేవ్ ఓ లెజెండ్. అందులో సందేహం లేదు. కానీ, ఆయన ముక్కుసూటి వైఖరి బీసీసీఐతో విభేదాలకు కారణమైంది. గవాస్కర్ సహా మాజీలందరూ బోర్డుతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా, ఈ హర్యానా హరికేన్ మాత్రం అంటీముట్టనట్టు ఉంటారు. తాజాగా, టీమిండియా ప్రస్థానంపై కపిల్ స్పందించారు. మితిమీరిన క్రికెట్ కారణంగానే బౌలర్లు త్వరగా గాయాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. తాము ఏడాదిలో ఐదు నెలలే క్రికెట్ ఆడేవారమని, ఇప్పుడు పది నెలలు ఆడుతున్నారని విశ్లేషించారు. టూర్ షెడ్యూల్ పై బీసీసీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కపిల్ అభిప్రాయపడ్డారు.