: టీచర్లు కాదు... చీటర్లు! పుట్టకముందే బీఈడీ డిగ్రీలందుకున్నారట!
బీహార్లో ఏదైనా సాధ్యమే! అదెలాగో చూడండి. 2012 మార్చి-ఏప్రిల్ మధ్యలో 32,127 మంది ఉపాధ్యాయులను నియమించారు. వారిలో 95 మందికి చెందిన సర్టిఫికెట్లు పరిశీలించి చూడగా ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. వారందరూ తాము పుట్టకముందే బీఈడీ డిగ్రీలు అందుకున్నట్టుగా ఆ పత్రాల్లోని తేదీలు చెబుతున్నాయి. సహార్సా గ్రామంలో ఉపాధ్యాయుడిగా నియమితుడైన ఎల్బీ సింగ్ అనే వ్యక్తి 1986 జనవరిలో పుట్టగా, అతను బీఈడీ డిగ్రీ 1979లోనే పొందినట్టు సర్టిఫికెట్లు చెబుతున్నాయి. అంటే తను పుట్టడానికి ఏడేళ్ళ ముందే బీఈడీ పూర్తిచేశాడన్నమాట! ఇందుకుమారి అనే యువతిదీ ఇదే పరిస్థితి! మొత్తమ్మీద ఆ రిక్రూట్ మెంట్ లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినవాళ్ళు 3000 మందికి పైగా ఉన్నారని బీహార్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది.