: సర్వీస్ సెక్టార్ లో తక్కువ పెట్టుబడి... ఎక్కువ ఆదాయం: చంద్రబాబు
కలెక్టర్ల సమావేశంలో సర్వీస్ సెక్టార్ పై తనకున్న మక్కువను చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. సేవల రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తుందని చంద్రబాబు అన్నారు. అలాగే సర్వీస్ సెక్టార్ లో ఎక్కువ మందికి ఉపాధి కూడా కల్పించవచ్చని తెలిపారు. అందుకే సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు అన్నారు. అదే వ్యవసాయ రంగంలో అయితే, ఎక్కువ పెట్టుబడి పెట్టినా తక్కువ ఆదాయం వస్తోందని చంద్రబాబు వెల్లడించారు.