: అప్పుడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరా రూ. లక్ష ఉండేది... ఇప్పుడు ఎకరం రూ. 30 కోట్లు
హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు అన్నారు. అప్పట్లో ఐటీ రంగంలో ఉన్న గ్రోత్ ను ముందుచూపుతో కనిపెట్టి... హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని చంద్రబాబు అన్నారు. తన విజన్ వల్లే సైబరాబాద్ నిర్మితమయిందని ఆయన అన్నారు. 1994లో హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరం కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉందని... తాను చేసిన డెవలప్ మెంట్ కారణంగా ఇప్పడు హైటెక్ సిటీ ప్రాంతంలో ఎకరం రూ. 30 కోట్లకు చేరుకుందని ఆయన అన్నారు.