: కోహ్లికి సాయపడేందుకు చిన్నప్పటి కోచ్ ఇంగ్లండ్ వెళుతున్నాడు
ఇంగ్లండ్ సిరీస్ లో వరస వైఫల్యాలతో బాధపడుతోన్న విరాట్ కోహ్లికి సాయపడేందుకు... అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఇంగ్లండ్ కు వెళ్లనున్నాడు. తనకు సాయపడేందుకు ఇంగ్లండ్ రావాలని కోహ్లి కోరాడని రాజ్ కుమార్ శర్మ తెలిపాడు. వీసా వచ్చిన వెంటనే ఇంగ్లండ్ కు బయల్దేరతానని ఆయన పేర్కొన్నాడు. కోహ్లి టెక్నిక్ లో ఎలాంటి లోపం లేదని... అయితే, అతను మరింత ఏకాగ్రతతో ఆడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. కోహ్లి చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడని... తాను గాడిన పడటానికి ఒకే ఒక ఇన్నింగ్స్ చాలని అంటున్నాడని ఆయన అన్నాడు. పదిరోజుల పాటు కోహ్లీతోనే తాను ఉంటానని... ఐదో టెస్ట్ మొదలైన తర్వాత ఇండియాకు బయలుదేరతానని రాజీవ్ శర్మ తెలిపాడు.