: చైనాను అధిగమించిన భారత్!


అన్ని రంగాల్లో దూసుకుపోతున్న చైనాను ఎట్టకేలకు భారత్ అధిగమించింది. ఎస్... ఇది నిజం. ఉత్పత్తి, సర్వీస్ రంగాల్లో భారత్ మెరుగైన వృద్ధిని సాధించి చైనాను వెనక్కి నెట్టేసింది. అంతర్జాతీయ బ్యాంక్ హెచ్ఎస్ బీసీ విడుదల చేసిన ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ (ఈఎంఐ) ఈ వివరాలను తెలియజేసింది. గత నెలలో ఉత్పత్తి, సర్వీసు రంగాలలో భారత్ పనితీరు 53 శాతానికి చేరుకోగా చైనా 51.6 శాతం నమోదు చేసింది. బ్రెజిల్ లో 49.3 శాతం, రష్యాలో 51.3 శాతం నమోదైంది. భారత్ ఇదే పనితీరు కనబరిస్తే భవిష్యత్తులో సంచలనాలు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News