: వందల కోట్ల విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
మన దేశంలో విదేశీపెట్టుబడుల (ఎఫ్ డీఐ)కు ఎన్డీఏ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. రూ. 1,528.38 కోట్ల విలువైన 14 ఎఫ్ డీఐ ప్రతిపాదనలకు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ) అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు లభించిన వాటిలో లౌరస్ ల్యాబ్ లోకి రూ. 600 కోట్లు, ఏసీఎంఈలోకి రూ. 275 కోట్లు, సింక్లెయిర్స్ హోటల్స్ లోకి రూ. 41.52 కోట్లు, గోల్డెన్ అగ్రి రిసోర్స్ (ఇండియా)లోకి రూ. 485.90 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఉన్నాయి.