: ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రంలో మహిళలపై దారుణమైన ఆంక్షలు


ప్రముఖ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ 'తెహ్రీక్ ఎ ఇన్సాఫ్' అధికారంలో వున్న ఖైబర్ ఫంక్తూంక్వా రాష్ట్రంలోని కరాక్ జిల్లాలో దారుణమైన ఆంక్షలు అమలవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, వాయవ్య పాకిస్థాన్ కు చెందిన గిరిజన ముస్లిం మహిళలపై మతాధికారులు ఆంక్షలు విధించారు. మగతోడు లేకుండా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. తమ ఆజ్ఞ ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాతో పాటు బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు. అలాగే మత్తుమందులు ఎవరైనా విక్రయించినట్టు తెలిసినా, రవాణా చేసినట్టు తెలిసినా తరువాత చోటు చేసుకునే పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News